విజయవాడ నగరంలో సోమవారం అధికారులు వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. నగరంలోని బుడవేరు ప్రాంతంలో వరద బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందజేసే కార్యక్రమానికి అధికారులు ముమ్మరం చేశారు. ప్రత్యేక వాహనాల్లో వరద బాధితులకు ఈ పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. విజయవాడ నగరం అంతా వరద నీటిలో మునిగి పోయింది. బాధితులకు పునరావస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.