విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అదనంగా పది పడకల తల్లి, బిడ్డల ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గురువారం లోక్ సభలో రూల్ 377 కింద ఈ అంశం లేవనెత్తారు. గర్భిణీ స్త్రీలు, శిశువులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన వైద్య సిబ్బంది మరియు నిధులు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మంజూరవాలని ఆయన కోరారు.