Apr 22, 2025, 19:04 IST/
ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి.. కేసీఆర్ దిగ్భ్రాంతి
Apr 22, 2025, 19:04 IST
ఉగ్రదాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల బీఆర్ఎస్ అధినే కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. 27 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అని పేర్కొన్నారు. తీవ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.