Apr 26, 2025, 07:04 IST/
హైదరాబాద్‌లోని పాకిస్తానీయులకు నోటీసులు
Apr 26, 2025, 07:04 IST
పహల్గామ్ దాడిని సిరీయస్‌గా తీసుకున్న భారత్, పాకిస్తాన్‌పై చర్యలు చేపట్టింది. ఉగ్రవాదులపై చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్రం పాక్‌కు వెళ్లే సింధు జలాలను ఆపేయగా తాజాగా హైదరాబాద్‌లో ఉన్న పాకిస్తానీయులకు కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు అధికారులు నోటీసులు అందజేశారు. హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు నలుగురికి నోటీసులు పంపించారు. ఆదివారంలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని హెచ్చరించారు.