Apr 22, 2025, 17:04 IST/
పహల్గామ్ ఉగ్రదాడి.. భారత్కు మా సంపూర్ణ మద్దతు: ట్రంప్
Apr 22, 2025, 17:04 IST
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. "కశ్మీర్ ఘటన తనను తీవ్రంగా తీవ్రంగా కలిచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అమెరికా బలంగా మద్దతుగా నిలుస్తుంది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలి. ప్రధాని మోదీ, భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’’ అని ట్రంప్ 'ట్రూత్'లో పోస్టు చేశారు.