కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాలలోని బౌద్ధ స్థూపాన్ని కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ లు శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ బౌద్ధ స్తూపం యొక్క విశిష్టతను కలెక్టర్ కు వివరించారు. అనంతరం బుద్ధుని మ్యూజియంలో ఉన్న శిల్ప సంపద విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.