విజయవాడ నగరాన్ని వరద ముంపు ముంచెత్తడంతో ప్రజలు అస్తవ్యస్తం అయ్యారు. దింతో అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యొక్క హ్యుమానిటీ ఫస్ట్ శాఖ ఆధ్వర్యంలో అహ్మదీయ ముస్లింలు బుధవారం బాధితులకు ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ అందించారు. ప్రపంచ ముస్లింల అధినేత అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఐదవ ఉత్తరాదికారి హజ్రత్ మీర్జా మస్రూర్ అహ్మద్(లండన్) ఆదేశాల మేరకు బాధితులకు పంపిణీ చేయడం జరిగిందని ఏపీ ఇంచార్జీ ఇస్మాయీల్ అన్నారు.