దివ్యాంగుల పింఛన్లపై విచారణ నిర్వహించాలి

80చూసినవారు
దివ్యాంగుల పింఛన్లపై విచారణ నిర్వహించాలి
మోపిదేవి మండలంలోని దివ్యాంగుల పింఛన్లపై విచారణ నిర్వహించాలని టిడిపి, జనసేన నాయకులు కోరారు. శనివారం మోపిదేవిలో వారు మాట్లాడుతూ, పలు గ్రామాలలో 15 నుండి 40 వేల రూపాయలకు దివ్యాంగుల సదరం సర్టిఫికెట్ తీసుకువచ్చి పింఛను పొందుతున్న బోగస్ లబ్ధిదారులు ఉన్నారని ఆరోపించారు. పలు గ్రామాలలో గడచిన వైసిపి ప్రభుత్వ హయాంలో దళారి ముఠా నగదు ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల నుండి బోగస్ సర్టిఫికెట్లు తీసుకువచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్