వైభవంగా అమ్మ వారికి ఆషాఢ సారె సమర్పణ

63చూసినవారు
వైభవంగా అమ్మ వారికి ఆషాఢ సారె సమర్పణ
నాగాయలంక మండలం గణపేశ్వరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ దుర్గా గణపేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ మాసం, గురు పౌర్ణిమ సందర్భంగా ఆదివారం తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, లేబాక పద్మప్రియ ఆధ్వర్యంలో శ్రీ దుర్గమ్మ అమ్మ వారికి 108 కేజీల పసుపు, కుంకుమలతో పాటు ఆషాఢ సారెను భక్తితో సమర్పించారు. భక్తులు విరివిగా తరలి వచ్చి ఆషాఢం సారేను పల్లాలతో పట్టుకొని మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్