అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చిన్నారులు అప్రమత్తతతో వ్యవహరించాలని ఫైర్ స్టేషన్ అధికారి ప్రసాద్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన గురువారం శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అనుకోని సమయంలో గృహ నివాసాల్లో అనుకోని సమయంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే ప్రతి ఒక్కరూ ఆరు బయట సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.