అవనిగడ్డ: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటిన స్వచ్ఛ కార్యకర్తలు

70చూసినవారు
అవనిగడ్డ: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటిన స్వచ్ఛ కార్యకర్తలు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు శుక్రవారం ఉదయం మొక్కలు నాటారు. చల్లపల్లిలో జరుగుతున్న స్వచ్ఛ చల్లపల్లి 3498వ రోజులో హైవే పక్కనే మొక్కలు నాటారు. స్వచ్ఛ చల్లపల్లి రధసారథులు డాక్టర్ డీఆర్కే. ప్రసాద్, డాక్టర్ పద్మావతిల నేతృత్వంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా చల్లపల్లిలో ఇప్పటి వరకూ 30వేలకు పైగా మొక్కలు నాటినట్లు డీఆర్కే ప్రసాద్ తెలిపారు. హైవే పక్కనే నీడనిచ్చే మొక్కలు, ఆహ్లాదకరంగా, అందంగా ఉండేందుకు వివిధ పూలమొక్కలు సైతం నాటామన్నారు.

సంబంధిత పోస్ట్