పేదల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డలోని ప్రభుత్వ హైస్కూలులో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామన్నారు.