కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఫ్లెక్సీలో తొలగింపు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం రాత్రి అవనిగడ్డ ఎస్సై శ్రీనివాస్ భారీగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాగా అవనిగడ్డ ప్రధాన సెంటర్ లో ఉన్న ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఫ్లెక్సీలు తొలగించకపోవడం పట్ల ప్రజలు, ప్రతిపక్ష పార్టీల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలగిస్తే అందరి ఫ్లెక్సీలు తొలగించాలని కోరుతున్నారు.