మానవ సంబంధాలు ప్రశ్నార్ధకముగా మారుతున్న తరుణంలో తండ్రి చివరి కోరికను తీర్చి పలువురికి ఆదర్శంగా నిలిచారు కుమార్తెలు. మోపిదేవి మండల పరిధిలోని బోడగుంట గ్రామానికి చెందిన చిలుమూరి అర్జున (75) వృద్ధాప్యంలతో తుదిశ్వాస విడిచారు. అర్జునకు నలుగురు కుమార్తెలే కావడంతో గత కొంతకాలంగా నలుగురు కుమార్తెలను తన సమాధి కార్యక్రమం నిర్వహించాలని కోరాడు. శనివారం సాయంత్రం నలుగురు కుమార్తెలు తండ్రి పాడేను మోశారు.