పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో కృష్ణాడెల్టా సుభిక్షమవుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం సాయంత్రం అవనిగడ్డ మండలం మోదుమూడిలో ఉపాధి నిధులు రూ. 20 లక్షలతో నాలుగు సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట కాలువలు, డ్రైనేజీలలో గుర్రపు డెక్క, తూటికాడ తొలగించేందుకు ప్రభుత్వ నిధులు మంజూరు చేసిందన్నారు.