నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక సమగ్రంగా తయారు చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం అవనిగడ్డలోని మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశం జరిగింది. అధికార యంత్రాంగంతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఏర్పాటు గురించి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని సూచించారు.