నియోజకవర్గంలో రూ. 18 కోట్ల 69 లక్షల 70వేలతో చేసిన విస్తృత అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం సాయంత్రం అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలులంకలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఉపాధి పథకం నిధులు రూ. 64 లక్షలతో 1, 070 మీటర్ల మేర నూరు శాతం సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయ్యేలా నూతనంగా నిర్మించిన పదిహేను సీసీ రోడ్లను ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు.