అవనిగడ్డ: అమ్మవారి జాతరకు రెండవ రోజు పోటెత్తిన భక్తులు

61చూసినవారు
అవనిగడ్డ: అమ్మవారి జాతరకు రెండవ రోజు పోటెత్తిన భక్తులు
అవనిగడ్డలో వేంచేసి ఉన్న శ్రీలంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా రెండవ రోజు ఆదివారం అమ్మవారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. పిల్లలు, పెద్దలు అమ్మవారికి నైవేద్యాలు, ఘటం బిందెలు సమర్పించి వారి మొక్కుబడులను చెల్లించుకుంటున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయం వద్ద పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్