కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అవనిగడ్డ గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాంకును శుభ్రపరచడం, క్లోరినేషన్ చేసిన తేదీలను సంబంధిత రిజిస్టర్ లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా క్రమం తప్పకుండా ట్యాంక్ ను శుభ్రపరిచి ప్రజలకు మంచినీటిని అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ వారికి సూచించారు. వివిధ శాఖల అధికారులు ఉన్నారు