అవనిగడ్డ: డిజే బాక్స్ లకు ఎలాంటి అనుమతి లేదు

69చూసినవారు
అవనిగడ్డ: డిజే బాక్స్ లకు ఎలాంటి అనుమతి లేదు
అవనిగడ్డ సబ్-డివిజన్ పరిధిలో 14న నిర్వహించే డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్బంగా శాంతి భద్రతల దృష్ట్యా ఎటువంటి డిజే బాక్స్ లకు అనుమతి లేదని అవనిగడ్డ డిఎస్పీ తాళ్లూరి విద్య శ్రీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా, ఎవరైనా వ్యక్తులు లేదా సంఘాలు మైక్ పెట్టడం, ర్యాలీ నిర్వహించడం లేదా ఇతర జన సమూహ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనుకుంటే, వారు తప్పనిసరిగా స్థానిక పోలీసులు నుండి అనుమతి తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్