విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృత తనిఖీలు చేసినట్లు విద్యుత్ శాఖ ఉయ్యూరు ఈఈ డీ. కృష్ణనాయక్ తెలిపారు. అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 28 విజిలెన్స్ బృందాలతో మండలంలో 2, 108 సర్వీసులు తనిఖీ చేసి 205 సర్వీసులకు రూ. 5, 04, 000లను అదనపు లోడు చార్జీ విధించినట్లు తెలిపారు. గృహ విద్యుత్ వినియోగదారులకు అదనపు లోడు క్రమబద్దీకరణకు యాభై శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.