అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన ఉండాలని అవనిగడ్డ ఫైర్ అధికారి పిఎస్. టివి. ప్రసాద్ అన్నారు. ఆదివారం అవనిగడ్డలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంట్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. ఇంట్లో వస్తువులను అలమరాళాలు సెల్పులలో సక్రమంగా ఉంచాలని, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాకాయలు ఇతర మండే పదార్థాలు ఏవి అందుబాటులో ఉంచొద్దన్నారు.