అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే సహించేది లేదని ఎస్ఐ కే. శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం పులిగడ్డ నుంచి అవనిగడ్డ కోర్టు సెంటర్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన వివిధ ఫ్లెక్సీలను రెవిన్యూ, పోలీస్, పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో తొలగించారు. ప్రమాదాలకు కారణమయ్యే ఫ్లెక్సీలు, అనుమతి లేని ఫ్లెక్సీలు తొలగించారు. మలుపుల్లో ఫ్లెక్సీలతో అనేక సమస్యలు వస్తున్నాయన్నారు.