అవనిగడ్డ: ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే

61చూసినవారు
అవనిగడ్డ: ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పై మాజీ ఎమ్మెల్యే సింహాద్రిరమేష్ బాబు ద్వజమెత్తారు. మంగళవారం అవనిగడ్డ వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో దాచుకో దోచుకో అన్న చందంగా పరిపాలన సాగుతుందన్నారు. నియోజకవర్గంలో ఇసుక, బుసక, మద్యం, పేద బియ్యం దొడ్డిదారిన అమ్మకాలు చేసి పేదల సొమ్మును ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్