పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శనివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 11వ విడత ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 21 మందికి రూ. 38, 92, 386లను చెక్కుల ద్వారా అందచేశారు. పది విడతల్లో 334మందికి రూ. 2, 25, 37, 424లు ఆర్ధిక సహాయం చేసినట్లు వివరించారు.