ఉల్లిపాలెంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తీవ్ర రూపం దాల్చింది. గ్రామానికి చెందిన పూషడపు దామోదర్రావు (40) సోమవారం రాత్రి భార్య శాంతితో తలెత్తిన విభేదాల అనంతరం ఇంటి పై గదికి వెళ్లి ఉరేసుకున్నాడు. గత ఎనిమిదేళ్లుగా భార్యపై అనుమానంతో తరచూ గొడవ పడేవాడని ఎస్ఐ చాణక్య తెలిపారు. గతంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.