అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101కు సమాచారం ఇచ్చి అగ్ని ప్రమాదాలను నివారించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావు అన్నారు. సోమవారం అగ్నిమాపక వారోత్సవాలను ఫైర్ స్టేషన్ లో ఫైర్ అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. హనుమంతరావు మాట్లాడుతూ, అనుకోని సమయాల్లో ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్ని ప్రమాదాన్ని గమనించిన వెంటనే ప్రతి ఒక్కరూ ఆరుబయట సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.