అవనిగడ్డ: 'రైతులకు పెట్టుబడి సహాయం అందించాలి'

80చూసినవారు
అవనిగడ్డ: 'రైతులకు పెట్టుబడి సహాయం అందించాలి'
అవనిగడ్డలోని చల్లపల్లిలో రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ వనజాక్షికి వినతిపత్రం ఇచ్చారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసి, రైతులు, కౌలురైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుత్తికొండ రామారావు కోరారు. మద్దతు ధరలు పెంచాలని, పంట రుణాల హద్దు రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్