అవనిగడ్డ మండలంలోని మోదుమూడి గ్రామంలో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలింపులు జరుగుతున్నా పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు లేకుండా నిస్సహాయంగా పరిస్థితి కొనసాగుతుందని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి, విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నాయని ప్రజలు కోరుతున్నారు.