కూటమి ప్రభుత్వంలో ఇప్పటికి 95 మంది లబ్ధిదారులకు రూ. 74, 01, 925 ఆర్థిక సహాయం అందించినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శనివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు రూ. 12, 88, 158 సహాయం చెక్కులు అందచేశారు. ఎమ్మెల్యే తనయుడు వెంకట్రామ్ పాల్గొన్నారు.