ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం పట్ల అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హర్షం ప్రకటించారు. శనివారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలుగులో పాలనకు ఇది తొలి అడుగుగా భావిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.