అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శ్రీగణపతి సచ్చిదానంద స్వామిని దర్శించుకున్నారు. ఆదివారం విజయవాడలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామిని, బాలస్వామి శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీలను దర్శించుకుని వారి ఆశీస్సులు తీసుకున్నారు. మోపిదేవి, హంసలదీవి సందర్శించవలసిందిగా బుద్ధప్రసాద్ వారిని కోరారు. సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ సాగర సంగమం వద్ద కృష్ణమ్మ పాదుకలను ప్రతిష్టించిన సన్నివేశాన్ని మరువలేనన్నారు.