సామాన్యుల గురించి ఆలోచించే ఆసామాన్య నాయకుడు పవన్ కళ్యాణ్ అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం అవనిగడ్డలో ఆయన మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాలకు చేరువైందన్నారు. జనం కోసం ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ అని, సామాన్య ప్రజల బాగోగుల కోసమే పవన్ కళ్యాణ్ ఆలోచన ఉంటుందన్నారు.