వేసవికాలం ఇంకా రాకమునుపే ఎండలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అవనిగడ్డ మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో బోసిపోయి దర్శనమిస్తుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి ఎండ వేడిమి అధికంగా ఉండడంతో ప్రజలు బయటకు రాలేదు. వేసవి తాపాన్ని తట్టుకునేలా చల్లని శీతల పానీయాలు స్వీకరిస్తున్నారు. ఇళ్ల వద్ద ఏసీలు, కూలర్లు వేసుకొని సేద తీరుతున్నారు.