ఘంటసాల మండలం యండకుదురులో ఉన్న 22ఏ భూములను జాబితా నుంచి తొలగించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ను రైతులు కోరారు. శుక్రవారం అవనిగడ్డ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసిన రైతులు వినతి పత్రం అందజేశారు. భూముల క్రయవిక్రయాలు చేసుకోవడం కష్టపరంగా మారిందని రైతు తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.