ప్రజలకు మరింత దగ్గరగా ఉండేలా పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. శనివారం రాత్రి అవనిగడ్డ సిఐ యువ కుమార్, ఎస్‌ఐ శ్రీనివాస రావు అవనిగడ్డ పరిధిలోని రామచంద్రాపురం గ్రామం నందు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ, గ్రామాల అంతర్గత శాంతి భద్రతలు, ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం మరియు పోలీసింగ్‌ను ప్రజలకు మరింత దగ్గర చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.