రహదారి లేక అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలులంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మరమ్మతులు కారణంగా రహదారిని పూర్తిగా తొలగించి సుమారుగా 15రోజులు గడుస్తున్నా కూడా ఇంకా పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం కాలేదు. నత్తనడకన కూడా పనులు చేయడం లేదని, ఈ మరమ్మతులు చేసేవాళ్ళని అధికారులు కూడా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. వర్షాలు వస్తే రహదారి నిర్మాణం ఆగిపోతుందని అంటున్నారు.