సోలార్ విద్యుత్తు వినియోగానికి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు రూపొందించిన పీఎం సూర్య ఘర్ - ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ప్రభుత్వం అందించే సోలార్ విద్యుత్ సబ్సిడీ అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు.