రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ రంగాల్లో కీలక ప్రగతి సాధిస్తున్నామని టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు అన్నారు. గురువారం స్థానిక పెట్రోల్ బంకు వద్ద ఉన్న అవనిగడ్డలోని టీడీపీ మండల కార్యాలయంలో "సుపరిపాలనలో తొలి అడుగు" వేడుకల సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతల సంబరాలు అవనిగడ్డలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.