అవనిగడ్డ ఒకటవ వార్డు చెందిన మహిళ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద బుధవారం పక్కనే ఉన్న పంట కాలువలో పడిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చి 108కు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు.