ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజులు నిర్వహించ తలపెట్టిన అవనిగడ్డలోని ఆర్టీసీ డిపో గేటు వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శి మహేష్ సురేష్, రంగారావు, కమల, వెంకటలక్ష్మి ప్రసన్న కుమార్ గ్యారేజ్ కమిటీ మరియు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు