బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట పంచాయతీ శివారులో ఉన్న జానకీరామపురంలో శనివారం రాత్రి ఓ బాలుడిపై కుక్క దాడి చేసింది. బాలుడిని రక్షించేందుకు వెళ్లిన తల్లి, అమ్మమ్మను కూడా కుక్క కరిచిందని స్థానికులు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురూ గాయాలపాలవ్వడంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.