ప్రఖ్యాత చిత్రకారుడు దివంగత బాపు శిష్యుడు, నరసాపురం పట్టణానికి చెందిన చిత్రకారుడు, కళారత్న బిరుదాంకితులు కడలి సురేష్, విజయవాడ మన గ్రామం అధినేత మొవ్వ రామకృష్ణ బుధవారం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును మర్యాద పూర్వకంగా కలిశారు. ఆగస్టు 4న మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు జయంతి పురస్కరించుకొని కడలి సురేష్ చిత్రించిన మండలి వెంకట కృష్ణారావు - ప్రభావతి దంపతుల చిత్రాన్ని ఆయనకు బహుకరించారు.