ఘంటసాల గ్రామంలోని బౌద్ధ స్తూపం వద్ద యోగాంధ్ర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం ఆర్డీఓ స్వాతి పర్యవేక్షణలో యోగా కార్యక్రమం సంధర్భంగా భారీ బుద్ధుని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. యోగా ముద్రలో ఉన్న బుద్ధుని ఫోటోతో కూడిన ఫ్లెక్సీలో బుద్ధం. శరణం గచ్చామి పేరుతో ముద్రించారు. ఈ ఫ్లెక్సీలు చూసేందుకు భారీగా ప్రజలు రావడం విశేషం. కొంతమంది ఫోన్లలో సెల్ఫీలు తీసుకున్నారు.