ఘంటసాల: ప్రారంభమైన స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు

66చూసినవారు
ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలోని శ్రీకాకుళేశ్వర స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావుచే ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలిరోజు సందర్భంగా స్వామివారిని పెండ్లి కుమారుడు, అమ్మవారిని పెళ్లి కుమార్తె గావించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్