ఘంటసాల: విరిగిన విద్యుత్ స్తంభం

76చూసినవారు
ఘంటసాల గ్రామంలోని బోలెం గుంట రోడ్డులో విద్యుత్ స్తంభం విరిగి ప్రమాదకరంగా మారింది. మంగళవారం సాయంత్రం మేతలోడుతో వచ్చిన లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టగా, సగం వరకు విరిగిఇనుప చువ్వలు బయటికి వచ్చాయి. విరిగిన విద్యుత్ స్తంభానికి విద్యుత్ వైర్లు ఉండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సమీపంలో పశువుల యజమానుల వరిగడ్డి వాములు ఉన్నాయి. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్