ప్రతి ఏడాది మే నెలలోనే కనిపించే మే పుష్పం వికసించి పలువురిని ఆకట్టుకుంటుంది. మండల కేంద్రమైన ఘంటసాల గ్రామంలోని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పీసుపాటి వెంకట నరసింహారావు స్వగృహంలో ఈ మే పుష్పం వికసించింది. మామిడి చెట్టు నీడన ఈ పుష్పం వికసించటంతో ఇంటిలోని వారితోపాటు గ్రామస్తులు ఈ పుష్పాన్ని చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.