ఘంటసాల మండలం వేములపల్లి గ్రామంలో రీ సర్వే పూర్తి అయిన సందర్భంగా వివరములతో ముసాయిదా జాబితా విడుదల అయినట్టు తహసీల్దార్ విజయప్రసాద్ శుక్రవారం సదరు జాబితాను తహశీల్దార్, ఎంపీడీఓ, వేములపల్లి గ్రామ పంచాయతీ వారి కార్యాలయంలో ప్రచురించడం జరిగింది. శనివారం ఉదయం 10 గంటలకు జరిగే అభ్యంతరాలు ఉంటే గ్రామసభలో తెలియజేయాలని తహసీల్దార్ నిర్దేశించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.