ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడాలి, శ్రీకాకుళం, లంకపల్లి గ్రామ శివారు ప్రాంతాలలో రహస్యంగా పేకాట, కోడి పందేలు మద్యం సేవించు ప్రాంతాలను డ్రోన్ కెమెరా ద్వారా గురువారం పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, సమాజ శాంతి భద్రతకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులను కఠినంగా ఎదుర్కొంటామన్నారు.