చల్లపల్లిలో బీజేపీ సంబరాలు

84చూసినవారు
చల్లపల్లిలో బీజేపీ సంబరాలు
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడవ సారి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా చల్లపల్లి మండల బీజేపీ ఆధ్వర్యంలో చల్లపల్లి సెంటర్లో ఆదివారం సాయంత్రం సంబరాలు జరిగాయి. స్థానిక శ్రీలక్ష్మీగణపతి దేవాలయంలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు పూజలు నిర్వహించారు. మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. టపాసులు పేల్చి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్